
దుబాయ్: తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తిలక్ (791) ఒక్క ప్లేస్ ఎగబాకి మూడో ర్యాంక్‌లో నిలిచాడు.
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బాల్స్‌లోనే 30 రన్స్ చేయడంతో అతని ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (907) టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (729) ఒక్క స్థానం ఎగబాకి ఆరో ప్లేస్‌లో నిలిచాడు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి (747) నంబర్‌వన్ ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. రవి బిష్ణోయ్ (647), అక్షర్ పటేల్ (639), అర్ష్‌దీప్ సింగ్ (630) వరుసగా 12, 13, 16వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో హార్దిక్ పాండ్యా (238) టాప్ ర్యాంక్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ (168) 11వ ర్యాంక్‌లో ఉన్నాడు.