
హయత్ నగర్ పీఎస్ పరిధిలో వారం రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన బి ఫార్మసి విద్యార్ధిని సోనీ ఆచూకీ ఇంతవరకూ దొరకలేదు. బొంగుళూర్ గేట్ వద్ద మోస్ట్ వాంటెడ్ కిడ్నపర్ రవిశంకర్ చేతిలో కిడ్నాప్ అయిన ఆ యువతి మిస్సింగ్ పోలీసులకు ఇంకా మిస్టరీగానే ఉంది.కిడ్నాపర్ల ఆచూకీ పై రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. కిడ్నాపర్ నిన్న నల్లమల్ల అడవుల్లో, ఇవ్వాళ కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. రవిశంకర్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతని కోసం పలు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఆంద్రప్రదేశ్ వరకు అనుమానం వచ్చిన ప్రతి క్లూ ని కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. కిడ్నాపర్ ని పట్టించిన వారికి రాచకొండ కమిషనర్ రూ. 1లక్ష నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.