జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడలో ట్రాఫిక్ డైవర్షన్స్ : కింగ్‌డమ్ మూవీ ఈవెంట్పై పోలీస్ అలర్ట్

జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడలో ట్రాఫిక్ డైవర్షన్స్ : కింగ్‌డమ్ మూవీ ఈవెంట్పై పోలీస్ అలర్ట్

హీరో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ విడుదలకు సిద్దమైంది. మరో మూడ్రోజుల్లో (జులై31) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇవాళ (జులై28న) కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 వరకు ఈవెంట్ గ్రాండ్గా జరపనున్నారు.

చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెండ్రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్కి సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఈవెంట్కు భారీగా విజయ్ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, సినిమా నిర్మాతలు పలు సూచనలు చేశారు.

హైదరాబాద్ నగరంలోని పలు మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈవెంట్ దృష్ట్యా, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి (KVBR)స్టేడియం దగ్గర భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా  ఉంటుంది కాబట్టి ప్రయాణికులు ఆ ప్రాంతాన్ని నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

ALSO READ : వీడియో వైరల్: 25 మంది యంగ్ IPS ఆఫీసర్స్

ట్రాఫిక్ మల్లింపు వివరాలు::

1. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → KVBR స్టేడియం: కృష్ణ నగర్ Jn వద్ద మళ్లించబడింది. శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట మీదుగా.

2. మైత్రీవనం → జూబ్లీహిల్స్/మాదాపూర్: యూసుఫ్‌గూడ బస్తీ వద్ద RBI క్వార్టర్స్ – కృష్ణా నగర్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా మళ్లించబడింది.

3. మైత్రీవనం → బోరబండ: కృష్ణకాంత్ పార్క్ – కళ్యాణ్ నగర్ – బోరబండ మీదుగా సవేర ఫంక్షన్ హాల్ వద్ద మళ్లించారు.

4. బోరబండ → మైత్రీవనం: ప్రైమ్ గార్డెన్ – మిడ్‌ల్యాండ్ బేకరీ – GTS కాలనీ – ICICI U-టర్న్ – మైత్రీవనం మీదుగా మళ్లించబడింది.

𝗣𝘂𝗯𝗹𝗶𝗰 𝗣𝗮𝗿𝗸𝗶𝗻𝗴 𝗔𝗿𝗲𝗮𝘀:

• మెట్రో పార్కింగ్ (జానకమ్మ తోట 1 & 2), యూసుఫ్‌గూడ.

• సవేరా ఫంక్షన్ హాల్ & మహమూద్ ఫంక్షన్ హాల్ (4-వీలర్లు మాత్రమే).

ఏదైనా సహాయం కోసం, ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయండి. లైవ్ అప్‌డేట్‌ల కోసం ట్విట్టర్‌లో @HYDP మరియు ఫేస్‌బుక్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను అనుసరించండి.

ఈ సందర్భంగా లేటెస్ట్గా కింగ్‌డమ్ నిర్మాత నాగవంశీ.. పోలీసు డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడంలో అన్ని ఏర్పాట్లు మరియు మద్దతు ఇచ్చినందుకు హైదరాబాద్ సిటీ పోలీసులకి ప్రత్యేక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. అలాగే, పాస్‌లు ఉన్న అభిమానులందరూ ఎంట్రీ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు నాగవంశీ.