Global Tiger day 2025 : రాజసానికి, గాంభీర్యానికి నిలువెత్తు నిదర్శనం.. పులిలా బతకాలంటే..!

Global Tiger day 2025 : రాజసానికి, గాంభీర్యానికి నిలువెత్తు నిదర్శనం.. పులిలా బతకాలంటే..!

జీవవైవిధ్యం కాపాడటంలో పులులదే కీలక పాత్ర. వాటికి తెలియకుండానే అడవిని రక్షిస్తుంటాయి. మొక్కలను తినే జీవ జాతులను పులులు చంపి తినకపోతే అడవి అనేదే మిగలదు. అంటే...సాదు జంతువులను వేటాడుతూ...ఎకో సిస్టమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి పులులు. అయితే రానురాను అడువులు ధ్వంసం అవుతుండటం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. అవి మనుగడ సాగించేందుకు అవసరమైన అనుకూల వాతావరణం ఉండటం లేదు. క్రమంగా ఇవి అంతరించిపోయే ప్రమాదముందని గుర్తించిన ప్రపంచ దేశాలు, ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నారు.

ఒక పులి సంచరించే ప్రాంతం చుట్టుపక్కల మరో పులి సంచరించదు. 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఒక పులి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఫుడ్ పిరమిడ్లో అగ్రస్థానంలో ఉండే పెద్ద పులి నివసించాలంటే ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నిరకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతో కూడిన దట్టమైన అడవి అయ్యి ఉండాలి. అందుకే ఈ లెక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో పులులు. మనుగడ సాగించాలంటే... ఒక్కో పులికి 25 వేల ఎకరాల అడవిని కాపాడుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.

తన ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంది.  మూడేళ్ల వయసు రాగానే మగ పులి సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అడవులు అంతరించడం. అడవుల్లో నీటి కుంటలు లేకపోవడం వల్ల అవి ఊళ్లలోకి రావాల్సి వస్తోంది. సిటీలు పెరగడం, గ్లోబలైజేషన్ ప్రభావంతో రానురానూ అడవులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 93 శాతం పులులు కేవలం అడవుల నరికివేత వల్ల అంతరించిపోతున్నాయని ఓ స్టడీలో వెల్లడైంది.

ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో రాయల్ బెంగాల్ టైగర్... ఇండోచైనీస్ టైగర్...మలయన్ టైగర్... సైబీరియన్ టైగర్... సౌత్ చైనా టైగర్... సుమత్రన్ టైగర్.... బాలీ టైగర్..... కాస్పియన్ టైగర్.... జావన్ టైగర్ జాతులు పూర్తిగా అంతరించి పోయాయి.

కారణాలు ఇవే..

వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) లెక్కల (2014) ప్రకారం వందేళ్ల క్రితం సుమారు లక్ష పులులు ఉండేవి.  కాని ఇప్పుడు వాటి సంఖ్య చాలా తగ్గిపోయిందని వరల్డ్ వైడ్ ఫండ్  ప్రతినిథులు చెబుతున్నారు. 

టాప్-5 రిజర్వ్ లు

పులుల సంఖ్య పెరగడం ద్వారా ఎకో సిస్టమ్ లో  మంచి మార్పులు రావడమే కాకుండా, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉండే టాప్ 5 టైగర్ రిజర్వ్ లు ఇవే..

  • టదోబా అంథారి టైగర్ రిజర్వ్: మహారాష్ట్ర 
  • పెంచ్ టైగర్ రిజర్వ్: మధ్యప్రదేశ్ 
  • బందీపూర్ నేషనల్ పార్క్: కర్నాటక 
  • పన్నా నేషనల్ పార్క్:  మధ్యప్రదేశ్
  • నాగర్ హోల్ నేషనల్ పార్క్:  కర్నాటక

పులులు అంతరిపోవడానికి వేట, వాతావరణ మార్పులతోపాటు, పులులకు షెల్టర్ లేకపోవడం ముఖ్యమైన కారణాలు. అంతేకాకుండా పులి చర్మం, గోళ్లకు డిమాండ్ ఎక్కువ. చైనీస్ సంప్రదాయ వైద్యంలో పులుల గోళ్లు, పళ్లు, మీసాలను ఉపయోగిస్తారు. వాటి కోసం ఎక్కువ ధర చెల్లిస్తారు. అందుకే పులుల వేట, స్మగ్లింగ్ కూడా ఎక్కువైంది. దీంతో కేవలం పులులు మాత్రమే కాదు. ఇతర జీవులు కూడా మెల్లగా అంతరిస్తున్నాయి.

ఇదొక్కటే మార్గం

కేవలం అడవుల్ని నరకడం వల్లనే దాదాపు 93 శాతం వాటి ఆవాసాల్ని కోల్పోతున్నాయని సర్వేలు. చెప్తున్నాయి. దీన్ని బట్టి పులుల్ని, ఇతర జీవరాశులని సంరక్షించుకోవాలంటే.. అడవులు పెంచడం ఒక్కటే మార్గమని అర్ధం అవుతోంది. అడవులు పెంచడం ద్వారా జంతువుల సంఖ్య పెరగడమే కాక పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది. వాతావరణ మార్పులు కూడా జంతువులు అంతరించడానికి కారణం కాబట్టి వాతావరణ మార్పులకు కారణమయ్యే ప్లాస్టిక్, కాలుష్యాన్ని కూడా
తగ్గించాలి.

ఇప్పుడిప్పుడే..

మనదేశంలో పులి జాతీయ జంతువు కాబట్టి కొంతవరకైనా పులుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే ఉన్న నాలుగు జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని గత కొన్నేళ్ల నుంచి టైగర్ ట్రాకర్స్ వ్యవస్థను బలపరిచారు.

ప్రపంచం మొత్తం మీద ఉన్న పులుల సంఖ్యలో సగానికి పైగా మనదేశంలోనే ఉన్నాయి.  పులులను కాపాడుకోవల్సిన అవసరాన్ని మనదేశం ఎప్పుడో గుర్తించింది. 1972లోనే పులిని జాతీయ జంతువుగా ప్రకటించి, తర్వాతి ఏడాది నుంచే ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది. 

ALSO READ : గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెన్.. ఎలా పట్టావ్ ర్రా వాటిని

పులుల్ని వేటాడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తెచ్చింది. వాటి సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. దేశంలో 48 పులి అభయారణ్యాలను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణ గురించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఇండియన్ రైల్వే.. టైగర్ ఎక్స్ ప్రెస్ పేరుతో టూరిస్ట్ రైలు సేవలను కూడా ప్రారంభించింది. ఇందులో బాంధవగడ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్కులో సఫారీకి తీసుకెళ్తారు.