ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ బ్యాటింగ్ లో ఎలాంటి ఎంత విధ్వంసం సృష్టిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్, ప్రపంచ క్రికెట్ లో టీ20 ఫార్మాట్ లో ఇప్పటికే డేవిడ్ తనదైన మార్క్ తో చెలరేగుతూ ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా అతని బ్యాటింగ్ విధ్వంసం అబుదాబి టీ10 లీగ్ లోనూ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఎన్నో తుఫాన్ ఇన్నింగ్స్ లు ఆడిన డేవిడ్.. ఫైనల్లోనూ మెరుపు ఇన్నింగ్స్ తో తన జట్టును గెలిపించాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్ లో ఈ ఆసీస్ వీరుడు చేసిన ఒక పని తెగ నవ్వు తెప్పిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
అబుదాబి టీ10 లీగ్ లో భాగంగా ఆదివారం (నవంబర్ 30) ఆస్పిన్ స్టాలియన్స్, యుఎఇ బుల్స్ మధ్య ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో యుఎఇ బుల్స్ తరపున ఆడుతున్న డేవిడ్ తన సహచరుడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ తో ఆశ్చర్యపరిచాడు. టిమ్ అచ్చుగుద్దినట్టు నరైన్ బౌలింగ్ ను దించేయడం విశేషం. అప్పటికే యుఎఇ బుల్స్ విజయం ఖరారు కావడంతో డేవిడ్ చివరి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ లో ఐదు పరుగులే ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. డేవిడ్ బౌలింగ్ చూసి పొలార్డ్ తెగ నవ్వుకున్నాడు. ఇక నరైన్ అయితే డేవిడ్ బౌలింగ్ కు షాకయ్యాడు. నరైన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఏకపక్షంగా జరిగిన ఈ ఫైనల్లో యూఏఈ బుల్స్ 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లో 98 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజింగ్ లో ఆస్పిన్ స్టాలియన్స్ 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 70 పరుగులు మాత్రమే చేసి 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. టిమ్ డేవిడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Tim David mimicking Sunil’s bowling action right in front of him 😭pic.twitter.com/Cs9ETxCJBQ
— Kanishk (@jeene2yarr) December 1, 2025
