నీకు అంత దూల ఎందుకు బ్రో?.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ టిమ్ డేవిడ్ సెలబ్రేషన్స్ వైరల్

నీకు అంత దూల ఎందుకు బ్రో?.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ టిమ్ డేవిడ్ సెలబ్రేషన్స్ వైరల్

Tim David: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు, ప్లేయర్స్ అందరూ ఫుల్ టెన్షన్‌లో ఉండిపోయారు. చివరి బంతి వరకూ ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెకొన్నప్పటికీ.. ఎట్టకేలకు లో స్కోరింగ్ హై ఓల్టేజ్ ఫైట్ లో ఆర్సీబీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఓటమితో ముంబై టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. భువనేశ్వర్ కుమార్  సిక్సర్ కొట్టిన తర్వాత టిమ్ డేవిడ్ చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. 

చివరి ఓవర్‌లో ఆర్సీబీ గెలుపుకు 15 రన్స్ కావాల్సి ఉండగా, మూడో బంతికే రొమారియో షెఫర్డ్ చేరడంతో ముంబై ఇండియన్స్ డగౌట్‌లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక మ్యాచ్ ముంబైదే అనుకున్న తరుణంలో రాజ్ బవా వేసిన ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని భువీ సిక్స్ కొట్టడంతో.. ఆర్సీబీ డగౌట్‌లో జోష్ వచ్చేసింది. అందరూ ఇక ఆర్సీబీనే విజయం వరిస్తుందని చప్పట్లు కొట్టగా.. టిమ్ డేవిడ్ మాత్రం కుర్చీలో నుంచి లేచి రెండు మిడిల్ ఫింగర్స్ చూపించాడు. చివరి రెండు బంతుల్లో 3 పరుగులు చేసి ఆర్సీబీ గెలవడంతో విరాట్ కోహ్లి కూడా గ్రౌండ్‌లోకి వచ్చి మరీ సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఫస్ట్ బంతికే డకౌట్ కావడంతో ఆ ఫ్రస్టేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. 

ఇప్పుడు టిమ్ డేవిడ్ చేసిన సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది. టిమ్ మిడిల్ ఫింగర్స్ చూపించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాగా మిడిల్ ఫింగర్స్  టిమ్ డేవిడ్ ఎవరికి చూయించాడు అనే దానిపై క్లారిటీ మాత్రం రాలేదు. ముంబై ఆటగాళ్లకా? లేక అంపైర్లకా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి టిమ్ డేవిడ్ చేసింది మాత్రం కరెక్ట్ కాదంటూ ఐపీఎల్ క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. అయితే అతడు మిడిల్ ఫింగర్స్ చూయించడంతో అతడిపై ఐపీఎల్ బ్యాన్ పడుతుందని సమాచారం. ఐపీఎల్ క్రమశిక్షణ చర్యల ప్రకారం టిమ్ డేవిడ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని టాక్. నిజంగా ఐపీఎల్ ఈ సెలబ్రేషన్‌పై చర్యలు తీసుకుంటే ఆర్సీబీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ప్లే ఆఫ్స్‌కు దగ్గరవుతున్న సమయంలో టిమ్ డేవిడ్ దూరమవ్వడం జట్టుకు పెద్ద ఇబ్బందనే చెప్పాలి. కానీ, దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు.