హార్దిక్ పాండ్య.. అగ్రెసివ్ ఆల్ రౌండర్. ఈ మధ్య ఆటకంటే ఇతర అంశాలపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఐపీఎల్ 2026 లో అటర్ ఫ్లాప్ షో తో పాటు ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకోవడానికి పాండ్యా నెగ్లిజెన్సీ కారణం అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో పాండ్యకు సంబంధించిన మరొక న్యూస్ వైరల్ గా మారింది.
పాండ్య ముంబై ఇండియన్ ఫ్రాంచైజ్ ఇన్ స్టా పేజ్ ను అన్ ఫాలో చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 10న రాయిపూర్ లో బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన ముంబై ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ పూర్తయిన కాసేపటికే.. పాండ్య అన్ ఫాలో చేశాడనే వార్తలు సోషమ్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
హార్ధిత్ ఇన్ స్టా అకౌంట్ స్క్రీన్ షాట్స్ ను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశార. అందులో 150 మందిని ఫాలో అువుతన్న పాండ్య.. ఆ లిస్టులో ముంబై ఫ్రాఛైజ్ లేక పోవడంతో తో చర్చీయాంశంగా మారింది. మరి కాసేపటికే మళ్లీ 151 మంది ని ఫాలో అవుతున్నట్లుు ఉండగా.. అందులో ఈసారి ముంబై టీమ్ కూడా ఫాలో అవుతున్నట్లు ఉంది. దీంతో.. అన్ ఫాలో చేసి మళ్లీ ఫాలో చేశాడని చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవానికి 2024లో రోహిత్ శర్మ ప్లేస్ లో హార్ధిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించిన నాటి నుంచే ముంబై ఫ్యా్న్స్ లో చీలిక వచ్చింది. అప్పట్నుంచి ముంబై గురించిన చిన్న వార్తలు, రూమర్స్ వచ్చినా వైరల్ గా మారుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా పాండ్యా అన్ ఫాలో చేసిన అంశం ఫుల్ వైరల్ గా మారిపోయింది.
►ALSO READ | ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షాట్ గన్ టోర్నీ: నీరూ–వివాన్కు కాంస్యం
వాస్తవానికి 2024లో రోహిత్ శర్మ ప్లేస్ లో హార్ధిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించిన నాటి నుంచే ముంబై ఫ్యా్న్స్ లో చీలిక వచ్చింది. అప్పట్నుంచి ముంబై గురించిన చిన్న వార్తలు, రూమర్స్ వచ్చినా వైరల్ గా మారుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా పాండ్యా అన్ ఫాలో చేసిన అంశం ఫుల్ వైరల్ గా మారిపోయింది.
ఎందుకు ఇంత ప్రచారం..
పాండ్యకు, ముంబై ఫ్రాంఛైజీకి చెందినవార్తలు ఫుల్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఆర్సీబీతో ఓటమితో ప్లే ఆఫ్ రేస్ నుంచి ముంబై తప్పుకోవడంతో.. ప్యాన్స్ లో ఆగ్రహావేశాలు మరింత ఎక్కువవుతున్నాయి. మరోవైపు పాండ్య పర్ఫామెన్స్ విషయంలో కూడా చాలా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ మొత్తం 8 మ్యాచ్ లు ఆడిన ఈ ఆల్ రౌండర్.. కేవలం 146 రన్స్ మాత్రమే చేసి.. ఓన్లీ 4 వికెట్లు తీశాడు.
ఫామ్ లేమికి తోడు గాయాల కారణంగా.. మూడు మ్యాచ్ లకు పక్కన పెట్టాల్సి వచ్చింది. లక్నో ముంబై మ్యాచ్ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ వివాదంలో పాండ్య కావాలనే చేశాడు లేక సాంకేతిక కారణాలా అనేది పూర్తి విచారణలో తేలుతుంది.
