PEDDI Trailer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘పెద్ది’ ట్రైలర్ డేట్ వచ్చేసింది

PEDDI Trailer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘పెద్ది’ ట్రైలర్ డేట్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’(PEDDI). పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4, 2026న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు.

ఇందులో భాగంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రెండు పాటలు, ఫస్ట్ షాట్ టీజర్‌తో పాటు ‘ఫ్రైల్వాన్’ గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ స్పందనను దక్కించుకుని సెన్సేషన్ సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ప్రీ-రిలీజ్ ఈవెంట్..

జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సినిమా థీమ్‌కు తగ్గట్టుగా ప్రత్యేక విలేజ్ సెట్‌ను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. 

అడ్వాన్స్ బుకింగ్స్..

ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవగా, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో విడుదల చేయనుంది. జూన్ 3న నార్త్ అమెరికా వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. 

రికార్డు తిరగరాసేనా?

1970-80ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో కుస్తీ, క్రికెట్ క్రీడల చుట్టూ తిరిగే ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక క్రేజీ స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.