ఆ టెస్ట్ ఎప్పుడూ క‌రెక్ట్ రిజల్ట్స్‌ ఇవ్వ‌దు

ఆ టెస్ట్ ఎప్పుడూ క‌రెక్ట్ రిజల్ట్స్‌ ఇవ్వ‌దు
  • కరోనా సోకిన మొదట్లో టెస్ట్‌ చేస్తే ఫాల్స్‌ నెగెటివ్‌ వచ్చే చాన్స్‌ ఎక్కువ
  • అమెరికాలోని జాన్‌ హాప్కిన్‌ వర్సిటీ స్టడీ

వాషింగ్టన్‌: కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి ప్రస్తుతం వాడుతున్న రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్టేస్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ టెస్టు (ఆర్టీ పీసీఆర్‌) ఎప్పుడూ కరెక్ట్‌ రిజల్ట్స్‌ ఇవ్వదని అమెరికాలోని జాన్‌ హాప్కిన్‌ యూనివర్సిటీ చెబుతోంది. వైరస్‌ సోకి రెండు, మూడు రోజులైన వ్యక్తికి ఆర్టీ పీసీఆర్‌ టెస్టు చేస్తే ఫాల్స్‌ నెగెటివ్‌ వచ్చే చాన్స్‌ ప్రతి ఐదుగురిలో ఒకరికన్నా ఎక్కువుంటుందని చెప్పింది. కాబట్టి రోగికి ఏ టైమ్‌లో టెస్టు చేస్తున్నారో కూడా చాలా ముఖ్యమంది. వైరస్‌ సోకిన తొలిరోజు టెస్టు చేస్తే ఫాల్స్‌ నెగెటివ్‌ వచ్చే చాన్స్‌ 100 శాతం ఉంటుందని, 4 రోజుల తర్వాత చేస్తే 67 శాతానికి తగ్గుతుందని వివరించింది. లక్షణాలు కనిపించిన రోజు టెస్టు చేస్తే నెగెటివ్‌ వచ్చే రోజు 38 శాతం ఉంటుందని, అదే లక్షణాలు కనిపించాక మూడ్రోజుల తర్వాత చేస్తే నెగెటివ్‌ వచ్చే చాన్స్‌ 20 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఐతే వైరస్‌ సోకిన 9 రోజుల తర్వాత ఫాల్స్‌ నెగెటివ్‌ వచ్చే చాన్స్‌ 21 శాతం ఉంటే.. 21 రోజుల తర్వాత అది 66 శాతానికి పెరుగుతుందని వివరించింది. ఈ స్టడీ కోసం ఇంతకుముందు పబ్లిష్‌ చేసిన ఆర్టీ పీసీఆర్‌ పెర్ఫామెన్స్‌ స్టడీలను రీసెర్చర్లు అనలైజ్‌ చేసింది.

RT-PCR