జై శ్రీరాం : స్టాక్ మార్కెట్ టైమింగ్స్ కూడా మార్చేశారు

జై శ్రీరాం : స్టాక్ మార్కెట్ టైమింగ్స్ కూడా మార్చేశారు

అయోధ్యలో జనవరి 22న  శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.  ప్రాణప్రతిష్ట రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కార్యాలయాలకు  కూడా జనవరి 22న హాఫ్ డే హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో  స్టాక్ మార్కెట్ల వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ రోజు మనీ, మార్కెట్లు ఉదయం 9 గంటలకు బదులుగా మధ్యాహ్నం 2:30గంటల నుంచి  సాయంత్రం 5 గంటల  వరకు కొనసాగుతాయని  సర్క్యులర్ జారీ చేసింది ఆర్బీఐ.  జనవరి 22న హాఫ్ డే హాలిడే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మార్పు ఫారెక్స్, బాండ్ మార్కెట్ కు కూడా వర్తిస్తుందని తెలిపింది.

 జనవరి 22 అయోధ్యలో రాంలల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. అంటే కేవలం 84 సెకన్లు.. అంటే ఒకటిన్నర నిమిషం కూడా లేదు.. కేవలం 84 అంటే 84 సెకన్లు.. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.. ఇది ఎంతో అద్భుతమైన, శుభకరమైన ముహూర్తం అంట.. లేకపోతే అయోధ్యలో రాముడికే ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారు.. అందుకే ఈ దివ్యమైన.. మంగళమైన ముహూర్తం అని భావిస్తున్నారు జనం.