
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. 2024, జూన్ 11వ తేదీ మంగళవారం సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన తొలిసారిగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మల్లన్నకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
మే 27వ తేదీన జరిగిన నల్గొండ-వరంగల్-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై ఆయన గెలుపొందారు.