
కీసర, వెలుగు: కారును టిప్పర్ లారీ ఢీకొనడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లారెడ్డిగూడకు చెందిన గౌరవ్ (32) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శనివారం ఉదయం తన కారులో తిమ్మాయిపల్లి నుంచి కీసర వైపు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో గాంధీ హాస్పిటల్‌కు తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ ఎల్లప్పను కీసర పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.