హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌పై వడ్డీ తగ్గించుకోవచ్చు ఇలా

హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌పై వడ్డీ తగ్గించుకోవచ్చు ఇలా

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వడ్డీ రేట్లు పెరిగితే ఎక్కువగా ఇబ్బంది పడేది హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నవారే.  హోమ్ లోన్లను  ఎక్స్‌‌‌‌‌‌‌‌టర్నల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ రేటు అయిన రెపోతో  బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు లింక్ చేస్తాయి. దీంతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రెపో రేటును పెంచే కొద్దీ హోమ్ లోన్లపై పడే వడ్డీ కూడా పెరుగుతుంది. ఇలాంటి టైమ్‌‌‌‌‌‌‌‌లో  బారోవర్ల (అప్పు తీసుకున్నవారి)  ఈఎంఐని పెంచకుండా  హోమ్ లోన్‌‌‌‌‌‌‌‌ టెనూర్ (కాల పరిమితి) ని  బ్యాంకులు పెంచుతాయి. దీంతో బారోవర్ కట్టే ఈఎంఐలు ఎక్కువవుతాయి. బ్యాంకులు హోమ్ లోన్  టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీఫాల్ట్‌‌‌‌‌‌‌‌గా పెంచుతున్నాయి. 

కానీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  తెచ్చిన కొత్త రూల్‌‌‌‌‌‌‌‌తో  బారోవర్లు భారీగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.  ‘వడ్డీ రేట్లు పెరిగినప్పుడు  బ్యాంకులు ఈఎంఐని పెంచకుండా హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్ టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి’ అని బ్యాంక్‌‌‌‌‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాట్‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌ సీఈఓ అధిల్‌‌‌‌‌‌‌‌ శెట్టి అన్నారు. బారోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఎంఐలను చెల్లించగలడా? లేదా? ఆయన కెపాసిటీ ఎంటీ? అనేది పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బారోవర్లపై ఈఎంఐ భారం పడకుండా చూడడానికి ఇలా చేస్తాయని వెల్లడించారు. కానీ హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పెరిగితే బారోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించే వడ్డీ ఎక్కువవుతుందని ఇండియా మార్ట్​గేజ్​ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజీసీ) సీఓఓ అనూజ్‌‌‌‌‌‌‌‌ శర్మ పేర్కొన్నారు.  

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త రూల్‌‌‌‌‌‌‌‌..

చాలా మంది బారోవర్లు హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్ టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారు  బ్యాంకులను సంప్రదించొచ్చు. బారోవర్లకు ఈఎంఐ పెంచుకోవడానికి లేదా లోన్ టెనూర్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని బ్యాంకులకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఆదేశాలు ఇచ్చింది.  అంతేకాకుండా వడ్డీ రేటును మార్చి రెండింటిని కూడా ఎంచుకునే అవకాశాన్ని కలిపించింది.
 
ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లోని నాలుగు ముఖ్యమైన పాయింట్లు..

1. వడ్డీ రేట్లు మారినప్పుడు  హోమ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ ఈఎంఐ లేదా టెనూర్ మార్చాలనుకుంటే లెండర్లు బారోవర్లను సంప్రదించాలి. 
2. వడ్డీ రేట్లను మార్చినప్పుడు ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌ వడ్డీ రేటుకి మారడానికి బారోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇవ్వాలి.  అలానే ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌ వడ్డీ రేటుకు మారడంలో పడే ఛార్జీలను ముందుగానే డిస్‌‌‌‌‌‌‌‌క్లోజ్ చేయాలి.
3. లోన్‌‌‌‌‌‌‌‌ టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడానికి లేదా ఈఎంఐని పెంచడానికి లేదా రెండింటిని  ఎంచుకోవడానికి బారోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇవ్వాలి.
4. లోన్లపై పెరిగిన వడ్డీని కవర్ చేసేటట్టు  టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచడమనేది ఉండాలి. బ్యాంకులు వన్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌గా హోమ్‌‌‌‌‌‌‌‌లోన్లపై టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడానికి వీలుండదు.

వడ్డీ తగ్గుతుంది ఇలా!

ఒక బారోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2020 లో 7 శాతం వడ్డీ రేటు దగ్గర 20 ఏళ్లకు (240 నెలలు) గాను రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకునేటప్పుడు  మంత్లీ ఈఎంఐ రూ.38,765 దగ్గర ఉంది.  20 ఏళ్లలో పడే వడ్డీ రూ.43.04 లక్షలు అవుతుంంది. గత మూడేళ్లలో ఈ లోన్‌‌‌‌‌‌‌‌పై పడే వడ్డీ 9.25 శాతానికి పెరిగిందని అనుకుందాం. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త రూల్స్ ప్రకారం, ఈఎంఐ పెంచుకోవడానికి లేదా టెనూర్ మార్చుకోవడానికి బ్యాంకులు బారోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇస్తాయి. లేదా వడ్డీ రేటును మార్చుకొని రెండింటిని ఎంచుకోవచ్చు.  

కేస్‌‌‌‌‌‌‌‌1: బారోవర్ ఈఎంఐని పెంచుకున్నాడని అను కుందాం.  మూడేళ్లు పూర్తయ్యాయి కాబట్టి మిగిలిన 17 ఏళ్లలో లోన్‌‌‌‌‌‌‌‌ తీర్చాలని బారోవర్ చూస్తున్నాడు. దీంతో ఈఎంఐ నెలకు రూ.44,978 కి పెరుగుతుంది. హోమ్ లోన్ టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యేటప్పటికి బారోవర్ రూ.55.7 లక్షలు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుంది. 

కేస్‌‌‌‌‌‌‌‌ 2: ఈఎంఐ రూ.38,765 దగ్గరే కొనసాగాలని అనుకుంటే లోన్ టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 240‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల నుంచి 321 నెలలకు పెరుగుతుంది. లోన్‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌ ముగిసే నాటికి వడ్డీ కింద రూ.88.52 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అంటే టెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచుకోవడం వైపు మొగ్గు చూపే బారోవర్లు అదనంగా రూ.33 లక్షలు వడ్డీ కింద కట్టాల్సి ఉంటుంది. ఈఎంఐ పెరిగినా  చెల్లించగలిగే కెపాసిటి ఉన్న బారోవర్లు ఈ ఆప్షన్ ఎంచుకోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అలానే  ఈఎంఐ భారీగా పెరిగితే ఈ ఆప్షన్ ఎంచుకోవద్దని,  బారోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలవారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు.  సరియైన ఆప్షన్ ఎంచుకునే ముందే బారోవర్లు అన్ని విషయాలను జాగ్రత్తగా విశ్లేషించాలని సలహా ఇస్తున్నారు.