4.5 రెట్లు పెరిగిన ఎంఆర్​ఎఫ్ లాభం

4.5 రెట్లు పెరిగిన ఎంఆర్​ఎఫ్ లాభం

న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ ఎంఆర్​ఎఫ్ లిమిటెడ్ నికరలాభం (కన్సాలిడేటెడ్​) సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన రెండవ క్వార్టర్​లో  వార్షికంగా నాలుగున్నర రెట్లు పెరిగి రూ. 586.66 కోట్లకు చేరుకుంది. అధిక రాబడి, ముడిసరుకు ఖర్చులు తగ్గడం ద్వారా భారీ లాభాన్ని సంపాదించామని కంపెనీ తెలిపింది. ఎంఆర్​ఎఫ్​ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో రూ.129.86 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ. 6,217.1 కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందు ఏడాది కాలంలో రూ.5,826.3 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.4,161.18 కోట్లతో పోలిస్తే రెండో క్వార్టర్​లో వినియోగించిన మెటీరియల్స్ ధర రూ.3,748.9 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది.