కరోనా ఇప్పుడు మరింత ఉధృతంగా మారింది: మోడీ

కరోనా ఇప్పుడు మరింత ఉధృతంగా మారింది: మోడీ
  • తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచన
  • మాస్క్‌ వేసుకోవడం విసుగ్గా ఉంటే.. డాక్టర్లను గుర్తు చేసుకోవాలని పిలుపు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి కంటే ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌లో ప్రధాని మాట్లాడారు. ప్రజలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చేతులు శుభ్రం చేసుకుంటూ, సోషెల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మొద్దని, శుభ్రంగా ఉన్నప్పుడే మనం కరోనా అనే యుద్ధాన్ని గెలవగలమని చెప్పారు. మనం లక్షలాది మంది జీవితాలను కాపాడామని, కానీ కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని అన్నారు. డెత్‌ రేట్‌ తగ్గి, రికవరీ పెరిగిందని మోడీ చెప్పారు. చాలా మంది మాస్క్‌లు వేసుకుని విసిగిపోయారని, దాన్ని తీసి వేరే వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి డాక్టర్లను, కరోనా వారియర్స్‌ను గుర్తు చేసుకోవాలని చెప్పారు. “కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చే డాక్టర్లు, నర్సులు, కరోనా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ గురించి ఆలోచించండి. వాళ్లు గంటల పాటు మాస్కులు వేసుకుని మన కోసం పనిచేస్తున్నారు. మన ప్రాణాలను కాపాడేందుకు కీషి చేస్తున్నారు” అని మోడీ అన్నారు. కరోనా కారణంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌ కూడా విభిన్న పరిస్థితుల్లో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ రోజు మనం కరోనా వైరస్‌ నుంచి ఫ్రీడమ్‌ పొందాలని దేశంలోని యువత, ప్రజలంతా ప్లెడ్జ్‌ చేయాలని అన్నారు.