తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. భక్తులకు గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. భక్తులకు గాయాలు


తిరుమల ఘాట్ రోడ్డులో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండో ఘాట్ రోడ్డులో గోవింద మలుపు దగ్గర ఓ కారు రైలింగ్‌ను అతి వేగంతో ఢీకొట్టింది. కారు టైర్ పంక్చర్ కావడంతో.. తిరుగుతూ రోడ్డుపైకి వచ్చిన కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఇద్దరు వృద్ధులతో సహా ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తిరుమల ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంలో  కారు ధ్వంసం అయింది. ప్రమాదానికి  అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

 తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలపై టిటిడి ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీవారి ఆశీస్సులు కోరుతూ ..తిరుమల దిగువ ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర  విశిష్ట మహా శాంతి  హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది.  ఘాట్ రోడ్డులో వరుస  ప్రమాదాలపై చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించింది. ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. అలాగే ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు విజిలెన్స్ సిబ్బంది.. మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకుని అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.