తిరుమల హిల్స్‌ పార్కును అభివృద్ధి చేస్తం ..మణికొండ మాజీ చైర్మన్‌ కస్తూరి నరేందర్‌

తిరుమల హిల్స్‌ పార్కును అభివృద్ధి చేస్తం ..మణికొండ మాజీ చైర్మన్‌ కస్తూరి నరేందర్‌

గండిపేట, వెలుగు: మణికొండ మున్సిపాలిటీలోని పార్కులను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పద్ధతిలో అభివృద్ధి చేస్తామని మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ కస్తూరి నరేందర్‌ అన్నారు. మంగళవారం తిరుమల హిల్స్‌ పార్కులో కాలనీ వాసులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. అనంతరం తిరుమల హిల్స్‌ కాలనీ వాసులతో కలిసి ఇటీవల అభివృద్ధి చేసిన అల్కాపూర్​లోని పార్కు వన్​ను సందర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు జితేందర్, అహ్మద్‌ షాఖాన్, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.