ఇబ్రహీంపట్నం, వెలుగు: యాచారం ప్రభుత్వ దవాఖానకు తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్(లాక్టాలిస్ ఇండియా గ్రూప్స్) వారు అంబులెన్స్ డొనేట్ చేశారు. సోమవారం యాచారంలోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి ఓమ్నీ వెహికల్ అందజేశారు. కార్యక్రమంలో లాక్టాలిస్ ఇండియా గ్రూప్స్ హెచ్ఆర్ డైరక్టర్ నరేశ్, డిప్యూటీ ఇండస్ట్రియల్ డైరెక్టర్ రవిదేవరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
