తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్తోత్సవాలు.. ఎనిమిదో రోజు వైభవంగా రథోత్సవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్తోత్సవాలు.. ఎనిమిదో రోజు వైభవంగా రథోత్సవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన బుధవారం (అక్టోబరు 01) ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులుపెద్ద సంఖ్యలో  పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

ఎనిమిదో రోజు శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తారని ప్రసిద్ధి. అందులో భాగంగా ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించడం ఆచారంఉంది. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల పెద్దజీయ‌ర్‌స్వామి,  చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు స‌భ్యులు, జేఈవో వీర‌బ్రహ్మం, సీవీఎస్వో మురళి కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.