టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా విడుదల : బోర్డు సభ్యులుగా ఎవరెవరంటే..?

టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా విడుదల : బోర్డు సభ్యులుగా ఎవరెవరంటే..?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుల జాబితా విడుదల అయ్యింది. 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ అధికారికంగా జాబితాను విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితమే టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే కోటాలో పొన్నాడ సతీష్‌(ముమ్మిడివరం), సామినేని ఉదయభాను(జగయ్యపేట), తిప్పేస్వామి(మడకశిర)కి అవకాశం దక్కింది. గోదావరి జిల్లాల నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు(ఉంగుటూరు), నెరుసు నాగ సత్యం యాదవ్‌(ఏలూరు), ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా వీరవెంకట సుధీర్‌ కుమార్‌ (శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప నుంచి యానాదయ్య, మాసీమ బాబు, కర్నూలు నుంచి ఎల్లారెడ్డిగారి సీతారామిరెడ్డి(మంత్రాలయం), పెనక శరత్‌ చంద్రారెడ్డి, అనంతపురం నుంచి అశ్వథామ నాయక్‌కు చోటు దక్కింది.

టీటీడీ సభ్యులుగా మేకా శేషుబాబు, రాంరెడ్డి సాముల, డాక్టర్‌ కేథన్‌ దేశాయ్‌,   బాలసుబ్రమణియన్‌ పళనిస్వామి, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి, సుదర్శన్‌ వేణులకు అవకాశం దక్కింది. తమిళనాడు నుంచి డాక్టర్‌ ఎస్‌. శంకర్‌, కృష్ణమూర్తి వైద్యనాథన్‌,  కర్ణాటక నుంచి ఆర్‌వీ దేశ్‌పాండే, తెలంగాణ నుంచి చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి సీతా, మహారాష్ట్ర నుంచి అమోల్‌ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్‌ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు. 

ఈసారి మహారాష్ట్ర నుంచి ఏకంగా ముగ్గుర్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది.