
తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్‌లో పని చేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆలయాన్ని వెంటనే మూసేయాలని టీటీడీ ఆదేశించింది. శుక్ర, శనివారాలు గోవిందరాజ స్వామి టెంపుల్‌ను డిసిన్‌ఫెక్ట్ చేయనున్నారు. ఆలయాన్ని తిరిగి ఆదివారం తెరవనున్నారు. అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం.. టెంపుల్‌లో పని చేసే ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు అనారోగ్యంగా ఉండటంతో టీటీడీ సెంట్రల్ ఆస్పత్రికి బుధవారం వెళ్లాడు. జాగ్రత్త చర్యల్లో భాగంగా సదరు ఎంప్లాయీ శాంపిల్స్‌ను ఆస్పత్రి సిబ్బంది సేకరించి టెస్టింగ్‌కు పంపారు. శుక్రవారం ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో సదరు ఉద్యోగిని వెంటనే కొవిడ్–19 హాస్పిటల్‌లో చేర్పించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరితోపాటు కాంటాక్ట్‌లో వచ్చిన ఎనిమిది మంది ఆలయ ఎంప్లాయీస్‌ను క్వారంటైన్‌లో ఉంచారు. క్వారంటైన్‌లో ఉంచిన వారి శాంపిల్స్‌ను తీసుకొని టెస్టింగ్‌కు పంపారు.