 
                                    శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో 150వ మెట్టు దగ్గర రోడ్డు దాటుతున్న భక్తులు చిరుతను చూసి కేకలు వేశారు. అక్కడ దగ్గరలో ఉన్న సులభ్ కార్మికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని అధికారులు చేరుకున్నారు. దీంతో స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను టీటీడీ, ఫారెస్ట్ అధికారులు గుంపులు గుంపులుగా పంపుతున్నారు.

 
         
                     
                     
                    