టైటాన్ చేతికి క్యారేట్‌‌‌‌లేన్

టైటాన్ చేతికి క్యారేట్‌‌‌‌లేన్
  • కంపెనీలో మిగిలిన వాటానూ కొన్న కంపెనీ
  • డీల్ విలువ రూ. 4,621 కోట్లు
న్యూఢిల్లీ: సబ్సిడరీ కంపెనీ క్యారెట్‌‌‌‌లేన్‌‌‌‌లో మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేశామని టైటాన్ ప్రకటించింది. దీంతో  కంపెనీలో తన వాటాను 98.28 శాతానికి పెంచుకుంది. తాజాగా 27.18 శాతం వాటాను రూ.4,621 కోట్లకు కోనుగోలు చేసింది. క్యారెట్‌‌‌‌లేన్ ఫౌండర్స్‌‌‌‌ మిథున్‌‌‌‌ సాచేటి, శ్రీనివాస గోపాలంతో షేర్ పర్చేజ్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ను టైటాన్‌‌‌‌ కుదుర్చుకుంది. ‘క్యారెట్‌‌‌‌లేన్‌‌‌‌  టైటాన్ సబ్సిడరీ. తాజా డీల్‌‌‌‌తో కంపెనీలో ఉన్న 77.09 శాతం వాటా 98.28 శాతానికి పెరుగుతుంది’ అని టైటాన్ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.
కాగా, క్యారెట్‌‌‌‌లేన్‌‌‌‌ ఇంకా మార్కెట్‌‌‌‌లో లిస్ట్ కాలేదు. 2022–23 లో కంపెనీ  రెవెన్యూ రూ.2,177 కోట్లుగా రికార్డయ్యింది. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 31 లోపు ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని టైటాన్ పేర్కొంది. కాంపిటీ షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది. క్యారెట్‌‌‌‌లేన్ గ్రోత్‌‌‌‌ స్టోరీ ఇప్పుడే మొదలైందని టైటాన్ ఎండీ సీకే వెంకటరమణ్‌‌‌‌ అన్నారు. 
క్యారేట్‌‌‌‌లేన్‌‌‌‌కు టైటాన్‌‌‌‌ కంటే మంచి గమ్యస్థానం దొరకదని క్యారేట్‌‌‌‌లేన్ ఫౌండర్ మిథున్ సాచేటి అన్నారు. మరింతగా విస్తరించడానికి టాటా గ్రూప్ అనేక అవకాశాలను క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఆన్‌‌‌‌లైన్ బ్రాండ్‌‌‌‌గా క్యారేట్‌‌‌‌లేన్‌‌‌‌ 2008 లో స్టార్టయ్యింది. అఫోర్డబుల్‌‌‌‌ జ్యువెలరీ మార్కెట్‌‌‌‌లో విస్తరించడం మొదలు పెట్టింది. ఈ కంపెనీలో2016 లో టైటాన్ ఇన్వెస్ట్ చేసింది. తనిష్క్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ తో కలిసి క్యారేట్‌‌‌‌లేన్ భారీ గ్రోత్ నమోదు చేసింది.