యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ ఇట్లు మీ ఎదవ గ్లింప్స్ రిలీజ్..

యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ ఇట్లు మీ ఎదవ గ్లింప్స్ రిలీజ్..

త్రినాధ్ కఠారి హీరోగా  స్వీయ దర్శకత్వంలో  బళ్లారి శంకర్  ఓ యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ను నిర్మిస్తున్నారు.  తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తోంది. శనివారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేసిన  దర్శకుడు బుచ్చిబాబు సాన టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.   ఈ చిత్రానికి ‘ఇట్లు మీ ఎదవ’ అనే ఆసక్తి కరమైన టైటిల్‌‌‌‌ పెట్టారు.  

వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌ను కూడా అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.