శ్రీవిష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల రూపొందించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా టైటిల్ సాంగ్‌ను రవితేజ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించాడు. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ వాయిస్‌తో పవర్‌ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
‘కామ్రేడ్ కళ్యాణ్ అడుగే పెట్టాడు.. కామ్రేడ్ కళ్యాణ్ అదరగొట్టాడు.. ఒక్కడు ఉంటాడే.. ఎక్కడో ఒక్కడు ఉంటాడే.. చిమ్మటి చీకటిలో ఎర్రటి సూరీడవుతాడే.. విజులు విజులు తెలుగు వీరా.. నువ్వు తెగువలోన మరో చేగువేరా..’ అంటూ సాగిన పాటలో కామ్రేడ్‌గా హీరో క్యారెక్టర్‌ను ఎంటర్‌టైనింగ్‌గా ప్రజెంట్ చేశాయి.
ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 9న సినిమా విడుదల కానుంది.
