కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి: కోదండ రామ్

కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి: కోదండ రామ్

కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రామ్. తెలంగాణ సాధన కోసం బాపూజీ సర్వస్వం కోల్పోయారన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా హైద్రాబాద్  ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన మార్చ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ట్యాంక్ బ్యాండ్ పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నేతలు.