రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : కోదండరాం

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : కోదండరాం
  •     ఇండియా కూటమికి మద్దతివ్వాలని కోదండరాం పిలుపు

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలు సాధారణమైనవి కాదని టీజేఎస్ చీఫ్​ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఆత్మగౌరవంతో బతకడానికి ఓటు హక్కు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఓటు వేయడం మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే అని పేర్కొన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమి పనిచేస్తుందని, అందువల్ల కాంగ్రెస్ కు ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ర్ట ఓటర్లను కోదండరాం కోరారు.