TJS నాలుగు స్థానాల్లో పోటీ: కోదండ‌రాం

TJS నాలుగు స్థానాల్లో పోటీ: కోదండ‌రాం

తెలంగాణ జనసమితి (TJS) లోక్ స‌భ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధినేత కోదండ‌రాం ప్ర‌క‌టించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను పోటీలోకి దింపుతామ‌ని…. మరో స్థానంపై పార్టీలో విస్తృతంగా చర్చించిన తర్వాత అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.

TJS పోటీచేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామన్నారు కోదండరాం. ఆదివాసీల భూములను కాపాడేందుకు ‘ఆదివాసీ హక్కుల రక్షణ’ పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రాచలం నుంచి ఈ నెల 16న ప్రారంభం కానున్న ఈ యాత్ర.. మరుసటి రోజు(మార్చి-17) మేడారంలో ముగుస్తుందన్నారు కోదండరాం.