లోక్ సభ బరిలో TJS : 4 చోట్ల పోటీ

లోక్ సభ బరిలో TJS : 4 చోట్ల పోటీ

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై నాంపల్లి తెలంగాణ జనసమితి కార్యాలయంలో పార్టీ నేతలతో చర్చించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి సహా మొత్తం 4 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ నెల ఏడున రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నికలపై తుది తీర్మానాలు చేశామన్నారు. ఆదివాసీల సమస్యలను పరిష్కారం కోసం మార్చి 16, 17న రెండురోజుల పాటు భద్రాచలం నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర మొదలుపెడతామని చెప్పారు.

పోటీలో లేని చోట కాంగ్రెస్ కు బయటినుంచి మద్దతు

ఒకటీ రెండు రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం. రిక్లైమింగ్ రిపబ్లిక్ మేనిఫెస్టోతో పాటు గత ఎన్నికల మేనిఫెస్టోతో కలిపి కొత్త మేనిఫెస్టో రూపొందిస్తున్నాం. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ప్రజల హక్కులకు రక్షణలేకుండా పోయింది. దీని ప్రచారం కోసం ప్రజలు ప్రతిఒక్కరూ స్వతంత్రంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రచారానికి మూడు కమిటీలు ఏర్పాటు చేశాం. మానిటరింగ్.. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. 4 చోట్ల మేం పోటీ చేస్తున్నాం. పోటీలో లేని చోట్ల కాంగ్రెస్ కు బయటినుంచి మద్దతు ఇస్తాం. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగలేదు. జాతీయ స్థాయిలో ఎవరితో వెళ్లాలన్న దానిపై మా ప్రణాళికలు మాకు ఉన్నాయి” అని కోదండరామ్ అన్నారు.