
హైదరాబాద్: కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఆత్మ గౌరవ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిధుల ఖర్చు విషయంలో ఒక పద్ధతి లేకపోవడం అప్పులకు కారణమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే డిమాండ్ తో రాష్ట్రం ఏర్పడిందని, అయితే అవేమీ కేసీఆర్ పాలనలో నెరవేరలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎలాంటి ఉపయోగంలేదన్నారు. ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని మండిపడ్డారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తే తప్ప ప్రజలకు మేలు జరగదన్నారు.
మరిన్ని వార్తల కోసం...