ఆర్టీసీ కార్మికులకు టీజేఎస్ మద్దతు : కోదండరాం

ఆర్టీసీ కార్మికులకు టీజేఎస్ మద్దతు : కోదండరాం

కుక్కను చంపేముందు పిచ్చిదనే ముద్రవేసినట్లుగా.. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆర్టీసీని బద్నాం చేస్తోందని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం ఆర్టీసీపై కుట్రలు చేస్తోందన్నారు. ఇవాళ్టి కార్యాచరణలో భాగంగా సమ్మెకు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నారు జేఏసీ నేతలు. టీజేఎస్ చీఫ్ కోదండరాంను కలిసి మద్దతు కోరారు.

రేపు ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు రావాలని ఆహ్వానించారు. ఆర్టీసీ కార్మికులకు టీజేఎస్ పూర్తి మద్దతిస్తోందన్నారు కోదండరాం.