ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు

ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు

వచ్చే నెల జులైలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో ఇండియా టీం కూడా పాల్గొంటోంది. జులై 23న ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ఆగస్టు 8న ముగియనున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచే భారత అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల నజరానా ఇస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సిల్వర్ పతక విజేతలకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 కోటి అందిస్తామన్నారు.ప్రభుత్వ నిర్ణయంతో భారత ఒలింపిక్ బృందంలో ఉత్సాహం నెలకొంది. తమిళ ప్రభుత్వ నిర్ణయంతో భారత అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.