కోర్టు ఆర్డర్స్​ను ధిక్కరిస్తున్నరు: టీఎన్జీవో అధ్యక్షుడు

కోర్టు ఆర్డర్స్​ను ధిక్కరిస్తున్నరు: టీఎన్జీవో  అధ్యక్షుడు

హైదరాబాద్, వెలుగు: రూల్స్ కు విరుద్ధంగా ఎలక్షన్స్ జరిగిన టీఎన్జీవో సిటీ కమిటీని సిటీ సివిల్ కోర్టు రద్దు చేసిందని, అయినా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కమిటీ మీటింగ్ నిర్వహించిందని టీఎన్జీవో హైదరాబాద్ సిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీరామ్, విఠల్ బాబు లు అన్నారు. గతంలో ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, హరికృష్ణల కమిటీని కోర్టు రద్దు చేసి,  తమ కమిటీని కొనసాగించాలని ఆర్డర్స్ ఇచ్చిందని శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. 

అయితే, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఈ నెల 5న శ్రీకాంత్ కమిటీ సిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించిందని.. కోర్టు ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మీటింగ్ కు కేంద్ర సంఘం ఎలా అనుమతి ఇచ్చిందని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని  నేతలు తెలిపారు.