
రూల్స్ ప్రకారమే టీఎన్జీవో ఎన్నికలు
స్పష్టం చేసిన హైదరాబాద్ సిటీ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు
కోర్టు ఇచ్చే తీర్పును స్వాగతిస్తామని ప్రకటన
‘వెలుగు’లో వార్తపై స్పందన
హైదరాబాద్, వెలుగు: టీఎన్జీవో హైదరాబాద్సిటీ యూనియన్ కు రూల్స్ ప్రకారమే, ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికలు జరిగాయని యూనియన్ కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, హరికృష్ణ తెలిపారు. ‘టీఎన్జీవోలో మరో లొల్లి’ శీర్షికతో వెలుగులో వచ్చిన వార్తపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేశామని, అన్ని హెచ్ వోడీల ఆమోదంతోనే ఎన్నికలు నిర్వహించామన్నారు. ఇన్నాళ్లు ప్రెసిడెంట్ గా పనిచేసిన శ్రీరామ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, సంఘాన్ని భ్రష్టు పట్టించడం కోసం హైదరాబాద్సిటీ శాఖ, కేంద్ర సంఘం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోర్టుకు వెళ్లి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను స్వాగతిస్తామని తెలిపారు.