
మంచిర్యాల, వెలుగు: ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెన్నూర్‌కు వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి సన్మానించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. మంచిర్యాల మున్సిపాలిటీ ఇటీవల కార్పొరేషన్‌గా ఉన్నతీకరణ జరిగిన సందర్భంగా ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ఏ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 5 డీఏలు, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఇతర 57 డిమాండ్లను పరిష్కరించాలన్నారు. స్పందించిన మంత్రి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యదర్శి బి.రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పోన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బాపురావు, కోశాధికారి సతీశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియారాణి, రామ్ కుమార్, నరేందర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్పాటించని ఆఫీసర్లపై చర్య తీసుకోవాలి
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల వద్ద పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫ్లెక్సీ పెట్టకుండా ప్రొటోకాల్ పాటించని ఆఫీసర్లపై చర్య తీసుకోవాలని మంత్రి పొంగులేటిని దళిత సంఘాలు కోరాయి. భీమారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సుకు వచ్చిన మంత్రిని దళిత సంఘాల లీడర్లు కలిసి వినతిపత్రం అందజేశారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీ వంశీకృష్ణను పిలవటంలేదని, దళిత ఎంపీని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో జైపూర్ మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్, మాజీ సర్పంచ్‌లు పి.రాజన్న, గోనె నర్సయ్య, మాల మహానాడు చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేశ్ ఉన్నారు.