పిల్లల్లో సోషల్‌‌ స్కిల్స్‌‌ పెరగాలంటే..

పిల్లల్లో సోషల్‌‌ స్కిల్స్‌‌  పెరగాలంటే..
మీ చిన్నారులు అదే వయసు పిల్లలతో ఎక్కువగా గడిపేలా చూడాలి. తోటి చిన్నారులతో త్వరగా కలిసిపోయి, ఆడుకునే వాతావరణం కల్పించాలి. ఎంతసేపు ఇంట్లోనే కాకుండా, పిల్లలతో కలిసి టైమ్ స్పెండ్‌‌ చేసేలా చూడాలి. గ్రూప్‌‌ యాక్టివిటీస్‌‌లో పార్టిసిపేట్‌‌ చేసేలా చూడాలి.ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం, వాళ్ల బర్త్‌‌డేస్‌‌, ఇతర పార్టీల్లో పాల్గొనేలా చూడాలి. పెద్దవాళ్లతో అయినా, తోటి పిల్లలతో అయినా మాట్లాడేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్‌‌ ఉండేలా, ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ల కళ్లలోకి చూసి మాట్లాడేలా చేయాలి. పిల్లల్లో కాన్ఫిడెన్స్‌‌ పెంచాలి. బాగా మాట్లాడటమే కాదు.. ఎదుటివాళ్లు చెప్పింది వినడం కూడా నేర్పించాలి. ఎదుటి వాళ్ల ఫీలింగ్స్‌‌ ఏంటో అర్థం చేసుకునేలా చూడాలి. కోపం, బాధ, సంతోషం వంటి ఎమోషన్స్‌‌ను గుర్తించేలా పెంచితేనే, ఎదుటివాళ్ల మూడ్‌‌కు అనుగుణంగా బిహేవ్‌‌ చేయడం నేర్చుకుంటారు.