ఎలాస్క్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించాడు.. అమెరికాలో మూడో పార్టీగా ది అమెరికన్ పార్టీ

ఎలాస్క్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించాడు.. అమెరికాలో మూడో పార్టీగా ది అమెరికన్ పార్టీ

బిలియనీర్, టెక్సా అధినేత ఎలాన్  మస్క్ చెప్పినట్లుగానే కొత్త పార్టీ పెట్టారు. అమెరికా పార్టీ వ్యవస్థలో ఇది కీలక పరిణామం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో విబేధాలు.. ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్ కు వ్యతిరేకించిన ఎలాన్ మస్క్..ట్రంప్ ఆ బిల్లు చట్టంచేస్తే కొత్త పార్టీ పెడతానని గతంలో సవాల్ విసిరారు. శనివారం వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికా చట్ట సభల్లో ఆమోదం పొంది ట్రంప్ సంతకంతో చట్టంగా మారింది. దీంతో మస్క్ ముందు అనుకున్నట్లుగానే తన కొత్త పార్టీ ది అమెరికన్ పార్టీని ఆదివారం (జూలై 6) స్థాపించారు. 

ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో కొత్త పార్టీ ది అమెరికన్ పార్టీ స్థాపనకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.  కొద్ది రోజుల క్రితం నిర్వహించని ఈ పోల్ లో మస్క్ కొత్త రాజకీయ పెడతాను మద్దతు ఇవ్వండి అని అమెరికన్ ప్రజలకు చేసిన విజ్ణప్తికి భారీగా స్పందన వచ్చింది.. ఈ పోల్ లో 80శాతం అమెరికన్ ప్రజలు ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టాలని.. పార్టీ పేరును ది అమెరికన్ పార్టీ అని పేరు పెట్టాలని కూడా సూచించారు.. ప్రజలను ఇష్టం మేరకే తన పార్టీ పేరును ది అమెరికన్ పార్టీ అని నామకరణం చేశారు ఎలాన్ మస్క్.  

అమెరికాలో ప్రస్తుతం ఉన్న ద్విపార్టీ వ్యవస్థను విమర్శించిన ఎలాన్ మస్క్.. స్వేచ్ఛ పునరుద్దరణ, ప్రభుత్వ వ్యర్థాలను పరిష్కరించడం కోసం మూడో పార్టీగా ది అమెరికన్ పార్టీని స్థాపిస్తున్నానని ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ లో ప్రకటించారు. 

అంతకుముందు జూలై 4న US స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మస్క్ ఒక పోల్‌ను పోస్ట్ చేశారు. "మీరు రెండు పార్టీల వ్యవస్థ నుంచి  స్వాతంత్ర్యం కోరుకుంటున్నారా. మనం కొత్త అమెరికా పార్టీని సృష్టించాలా? అని .పోల్ ఫలితాలలో 65.4శాతం మంది "అవును" అని 34.6శాతం మంది "లేదు" అని ఓటింగ్ చేశారు.

ఈ చర్య మస్క్ ట్రంప్ పరిపాలన నుండి వైదొలిగిన తరువాత ,DOGE నుండి నిష్క్రమించిన తరువాత జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో బహిరంగంగా విభేదించిన తర్వాత ఆ వరల్డ్ బిలియనీర్ కొత్త రాజకీయ పార్టీని పెడతానని చాలాసార్లు హింట్ ఇచ్చారు. తాజాగా ఆచరణలో పెట్టారు ఎలాన్ మస్క్.