కరోనా టెస్టులు పెంచేందుకు మరో మూడు ల్యాబ్‌లు

కరోనా టెస్టులు పెంచేందుకు మరో మూడు ల్యాబ్‌లు
  •  రేపు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టెస్ట్‌ ఫెసిలిటీలను పెంచేందుకు వీలుగా మరో మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీ వాటిని ప్రారంభించనున్నారు. ఐసీఎమ్‌ఆర్‌‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌‌ ప్రివెన్షన్‌ అండ్‌ రీసెక్చ్‌ బేస్డ్‌ ఇన్‌ నోయిడా, ఐసీఎమ్‌ఆర్‌‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌‌ రీసెర్చ్‌ ఇన్‌ రీప్రొడెక్టివ్‌ హెల్త్‌, ముంబై, కోల్‌కతా ఐసీఎమ్‌ఆర్‌‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా, ఎంట్రిక్‌ డీసీజస్‌లో ల్యాబ్స్‌ ఫెసిలీట్స్‌ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాటిని స్టార్ట్‌ చేస్తారు. ఈ ఫెసిలిటీ వల్ల దేశంలో టెస్టింగ్‌ కెపాసిటీ పెరుగుతుంది. దీంతో హెల్త్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌‌ పెరిగిపోతుందని, దీని వల్ల కరెఓనా వ్యాధి బారిన పడిన వారిని త్వరగా గుర్తించే అవకాశం ఉంది. కేంద్ర హెల్త్‌ మినిస్టర్‌‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.