మిడతల నివారణ డ్రోన్లు, స్ప్రేయర్లు

మిడతల నివారణ డ్రోన్లు, స్ప్రేయర్లు

న్యూఢిల్లీ : పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, గుజరాత్ లకు వస్తున్న మిడతల నివారణపై కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది. వేల సంఖ్యలో దండుగా వస్తున్న మిడతలు పంటలను నాశనం చేస్తున్నాయి. మనదేశంలోకి పాకిస్తాన్ బార్డర్ నుంచి మిడతలు వస్తున్నాయి. ఇవి చేతికొచ్చిన పంటలను తింటూ పరేషాన్ చేస్తున్నాయి. దీంతో వీటి నివారణకు ప్రత్యేక డ్రోన్లు, స్ప్రేయర్లు, ఫైర్ టెండర్లను వినియోగించాలని నిర్ణయించారు. యూకే నుంచి వీటిని కొనుగోలు చేయనున్నారు. మిడతల కారణంగా మన దేశంలోనే కాదు చైనా, పాకిస్తాన్ లోనూ పంటలకు ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే హెచ్చరించింది. రాజస్తాన్, గుజరాత్ లలో దాదాపు 3 లక్షల హెక్టార్ల పంట నష్టం జరగవచ్చని అంచనా వేశారు. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు డ్రోన్ల ద్వారా పురుగుల మందు చల్లనున్నారు.