వ్యాక్సిన్‌ తీసుకోవడంపై డైలమాలో ట్రంప్ !!

వ్యాక్సిన్‌ తీసుకోవడంపై డైలమాలో ట్రంప్ !!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తీసుకోవడానికి తాను సిద్ధమేనని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్‌గా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవడంపై తాను సందిగ్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఈమధ్య ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాక్సిన్‌ విషయంలో డైలమాపై ట్రంప్ మాట్లాడారు.

‘నేను ముందుగా తీసుకుంటే వాళ్లు నన్ను చాలా సెల్ఫిష్ అంటారు. అందరికంటే ముందు వ్యాక్సిన్‌ తీసుకోవాలని నేను కోరుకున్నానని చెబుతారు. మరోవైపు ఇంకొందరు నన్ను ధైర్యశాలి అని కూడా మెచ్చుకుంటారు. నేనే మొదట తీసుకోవాలని వారు భావిస్తే అందుకు నేను సిద్ధమే. అదే సరైనది కూడా. నేను దాన్ని ముందుగా లేదా చివరగా తీసుకోవచ్చు’ అని ట్రంప్ చెప్పారు. పిఫిజర్, బయోఎన్‌టెక్ కంపెనీల నుంచి 100 మిలియన్ వ్యాక్సిన్‌ డోసుల కోసం రూ.1.95 బిలియన్ డాలర్‌‌లను యూఎస్ చెల్లించింది. ఇవి డిసెంబర్‌‌లో డెలివరీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవాలనే దానిపై ట్రంప్ డైలమాలో పడ్డారు.