నిజామాబాద్ జిల్లాలో 10 పాజిటివ్

నిజామాబాద్ జిల్లాలో 10 పాజిటివ్

నిజామాబాద్ జిల్లాలో మంగ‌ళ‌వారం 10 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విష‌యాన్ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయ‌న‌..మొత్తం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన 3వేల800 మందిలో ఒక్కరికీ కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు.. వారి కుటుంబ సభ్యులు బాగా సహకరించారని మర్ఖజ్ నుంచి వచ్చిన వారి వళ్ళనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మర్ఖజ్ నుంచి వచ్చిన వారు కూడా ప్రభుత్వంకు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో 60 మందిలో 29మందికి పాజిటివ్ వచ్చిందని.. వారితో పాటు మరో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు.

109 శాంపిల్స్ పెండింగ్ లో ఉన్నాయని.. మొత్తం 39 పాజిటివ్ కేసులలో 21 పాజిటివ్ కేసులు నిజామాబాద్ కు చెందినవే ఉన్నాయన్నారు. నిజామాబాద్ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని… అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు రావొద్దన్నారు. నిజామాబాద్ లో నాలుగు కంటోన్మెంట్ క్లస్టర్స్ ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. క్లస్టర్ విధానానికి ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి.