ఇవాళ (ఆగస్టు 25) వరలక్ష్మీ వ్రతం.. బంగారం, వెండి ధరలు ..

ఇవాళ (ఆగస్టు 25) వరలక్ష్మీ వ్రతం.. బంగారం, వెండి ధరలు ..

శుక్రవారం (2023,ఆగస్టు 25) వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్న (గురువారం ) కొంత బంగారం, వెండి ధరలు పెరిగినా.. శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. శ్రావణ మాసంలో మహిళలు బంగారం కొనడం ఆనవాయితీ వస్తోంది.. బంగారం, వెండి ధరలు అందుబాటులో ఉన్నాయి .. కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి అవకాశం.

ప్రస్తుతం మార్కెట్లో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర  రూ.54,500 ఉంది.  24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 59,450 గా కొనసాగుతోంది. ఇక దేశ అర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేల 500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 450గా ఉంది.

హైదరాబాద్  విషయానికి వస్తే..  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54వేల 500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 450 గా ఉంది.  ఇక వెండి ధరలు హైదరాబాద్ లో కేజీ వెండి రూ.80 వేలుగా ఉంది.