ప్లే ఆఫ్స్ పై ముంబై గురి..

ప్లే ఆఫ్స్ పై ముంబై గురి..

షార్జా : ప్లే ఆఫ్స్‌ బెర్తు కన్ఫామ్‌ చేసుకోవడమే టార్గెట్‌ గా డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం ఇక్కడ జరిగే లీగ్‌ మ్యాచ్‌ లో తమ చిరకాలప్రత్యర్థి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌ కే)తో పోటీపడనుంది. వరుస పరాజయాలకు తోడు కీలక  ప్లేయర్ల సేవలను కోల్పోయి నిరాశలో ఉన్న సీఎస్‌ కే మాత్రం ముంబైకి మరోసారి షాకివ్వాలని చూస్తోంది. ఇప్పటిదాకా పది మ్యాచ్‌ లాడి ఆరు పాయింట్లు సాధించిన చెన్నై.. మిగిలిన నాలుగింటిలో గెలిచినా ప్లే ఆఫ్‌ బెర్త్‌‌‌‌ దక్కే సూచనల్లేవు. కానీ ఇప్పటికే తమకు ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన ఈ సీజన్‌ ను అదిరిపోయే ఫినిషింగ్‌ టచ్‌ తో ముగించాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ బెంచ్‌ కు పరిమి తమైన పలువురు సీఎస్‌ కే యంగ్‌ స్టర్స్‌ కు ఈ మ్యాచ్‌ లో చాన్స్‌ దొరకవచ్చు.రాజస్తాన్‌ తో మ్యాచ్‌ తర్వాత కేదార్‌ పై మరిన్నివిమర్శలు రాగా.. రుతురాజ్‌ , జగదీశన్‌ లో ఒకరు ఆ ప్లేస్‌ ను భర్తీ చేయనున్నారు. డుప్లెసిస్‌ ,రాయుడు అడపాదడపా రాణిస్తున్నా వారికి సహకారం దొరకడం లేదు. బౌలింగ్‌ లోనూ చాలా ఇబ్బందులు పడుతున్న చెన్నై.. ముంబైని ఓడిస్తే సంచలనమే అవుతుంది. సీజన్‌ స్టార్టింగ్‌మ్యాచ్‌ లో చెన్నై చేతిలో ఓడి టోర్నీని ఆరంభించిన రోహిత్‌ సేన ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. వరుసగా ఐదు విక్టరీల తర్వాత పంజాబ్‌ తో జరిగిన లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌ లో సూపర్‌ ఓవర్‌ లో ఓడింది. చెన్నైకు చెక్‌ పెట్టి గత ఓటమికి బదులు తీర్చు కోవడంతోపాటు.. తిరిగి టచ్‌ లోకి రావాలని రోహిత్‌ సేన భావిస్తోంది.