
అబుదాబి: వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఇక్కడ మ్యాచ్ కంటే నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పైనే అందరి దృష్టి ఉంది. డీకే కెప్టెన్సీ వైఫల్యం చర్చకు దారితీస్తోంది. వరల్డ్ కప్ విన్నింగ్ ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ టీమ్‌లో ఉన్నా.. కేకేఆర్ మేనేజ్‌మెంట్ కార్తీక్‌పైనే నమ్మకం ఉంచింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో డీకే ఫెయిలవుతూనే ఉన్నాడు. టాప్ క్లాస్ప్లేయర్లను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. దీంతో నేటి మ్యాచ్ డీకేకి అగ్ని పరీక్ష కానుంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత చెన్నై గాడిలో పడింది. వాట్సన్ ఫామ్‌లోకి రావడం అతిపెద్ద సానుకూలాంశం. డుప్లెసిస్ మంచి టచ్‌లో ఉండగా. రాయుడు కూడా కుదురుకుంటే సీఎస్‌కేకు తిరుగులేదు. బ్రావో, జడేజా, కరన్ చెలరేగితే నైట్‌రైడర్స్‌కు కష్టాలు తప్పవు. ఫినిషర్‌గా ధోనీ తన మార్క్ చూపితే..సీఎస్‌కేకు తిరుగుండదు. బౌలింగ్‌లోనూ చెన్నైకి పెద్దగా సమస్యల్లేవు.