చెన్నైనిలుస్తుందా?..ఇవాళ హైదరాబాద్‌‌తో కీలక పోరు

చెన్నైనిలుస్తుందా?..ఇవాళ హైదరాబాద్‌‌తో కీలక పోరు

దుబాయ్‌‌: ఐపీఎల్‌‌–13 లీగ్‌‌ దశలో సగం మ్యాచ్‌‌లు కంప్లీట్‌‌ అయ్యాయి. కానీ టైటిల్‌‌ ఫేవరెట్‌‌ చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారుతోంది. ఆడిన 7 మ్యాచ్‌‌ల్లో రెండింటిలో గెలిచి టేబుల్‌‌లో లాస్ట్‌‌ నుంచి రెండో ప్లేస్‌‌లో నిలిచిన ధోనీసేన ఇప్పుడు చావోరేవో పరిస్థితిలో పడింది. ప్లే ఆఫ్‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతి మ్యాచ్‌‌ గెలవాల్సిన స్థితిని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ప్రతీకార పోరులో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఛేజ్‌‌ మాస్టర్‌‌ ధోనీ.. టీమ్‌‌ బ్యాటింగ్‌‌ సమస్యలతో ఎప్పుడూ లేనంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్లు వాట్సన్‌‌, డుప్లెసిస్‌‌ శుభారంభాలు ఇస్తున్నా.. మిడిలార్డర్‌‌ వైఫల్యం చెన్నైకి ప్రతికూలంగా మారింది.   ఇన్నాళ్లూ కేదార్‌‌ జాదవ్‌‌పై నమ్మకం పెట్టినా… అతను రాణించలేకపోయాడు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో జాదవ్‌‌ను డ్రాప్‌‌ చేసి జగదీశన్‌‌కు చాన్స్‌‌ ఇచ్చారు. రాయుడు, జగదీశన్‌‌ ఉన్నంతసేపు పటిష్టంగా కనిపించిన చెన్నై ఈ ఇద్దరి ఔట్‌‌తో ఓటమిపాలైంది. సామ్‌‌ కరన్, జడేజా, బ్రావో వైఫల్యం టీమ్‌‌ను వెంటాడుతున్నది. ఒత్తిడిలో ధోనీ కూడా తన ఫినిషింగ్‌‌ స్కిల్స్‌‌ను మర్చిపోతున్నాడు. బౌలింగ్‌‌లో దీపక్‌‌ చహర్‌‌, జడేజా ఆకట్టుకుంటున్నారు. బ్రావో రావడం కాస్త రిలీఫ్‌‌ ఇచ్చినా, కరన్‌‌, శార్దూల్‌‌ ఠాకూర్‌‌, కర్ణ్​ శర్మ గాడిలో పడాల్సి ఉంది.

మరోవైపు చెన్నై కంటే కొద్దిగా మెరుగైన స్థితిలో ఉన్న హైదరాబాద్‌‌కు కూడా ఈ మ్యాచ్‌‌లో గెలవడం అత్యవసరం. రాజస్తాన్‌‌ చేతిలో చేజేతులా ఓడటంతో ఇప్పుడు ఒత్తిడిలో పడిన ఆరెంజ్‌‌ ఆర్మీ.. ఈ మ్యాచ్‌‌పై దృష్టిపెట్టింది. బ్యాటింగ్‌‌లో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌కు సమస్యల్లేవు. బెయిర్‌‌స్టో, వార్నర్‌‌, మనీశ్‌‌, విలియమ్సన్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. అయితే పేసర్‌‌ భువనేశ్వర్‌‌ లేకపోవడంతో బౌలింగ్‌‌లోనే హైదరాబాద్‌‌ సమస్యలు ఎదుర్కొంటున్నది. మరీ ముఖ్యంగా డెత్‌‌ ఓవర్లలో రన్స్‌‌ కట్టడి చేసే సరైన బౌలర్‌‌ లేడు. రషీద్‌‌ ఖాన్‌‌ మెరుస్తున్నా.. యార్కర్‌‌ స్పెషలిస్ట్‌‌ నటరాజన్‌‌ మరింత కుదురుకోవాల్సి ఉంది