
పార్టీ ఆఫీస్, ఇతర బిల్డింగ్ లు ప్రారంభించనున్న కేసీఆర్
సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ గురువారం సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల పాటు సెగ్మెంట్‌లో పర్యటిం చి పలు అభివృద్ధి పనులతో పాటు టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ బిల్డింగ్‌ను ప్రారంభించనున్నారు. నాగుల బండ వద్ద ఐటీ హబ్ కు శంకుస్థాప నతో సీఎం పర్యటన స్టార్టవుతుం ది. పొన్నాలలో జిల్లా టీఆర్ఎస్ ఆఫీస్ బిల్డింగ్, మిట్టపల్లిలో రైతు వేదిక భవనం, సిద్దిపేట బైపాస్ రోడ్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు.
కోమటి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించి నర్సాపూర్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. చింతల్ చెరువు వద్ద సిద్దిపేట మునిసిపాల్టీ అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు చంద్లాపూర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన గెస్ట్ హౌస్, ఇరిగేషన్ ఆఫీస్ భవనాలను ప్రారంభిస్తారు.