బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే

బంగారం కొనాలనుకుంటున్నారా..   ధరలు ఎలా ఉన్నాయంటే

కొత్త సంవత్సరంలో బంగార ధరలు వరుసగా మూడు సార్లు దిగొచ్చాయి. దీంతో రూ.60వేలకు చేరువైన బంగారం ధరలు కాస్త తగ్గి రూ.57వేలకు చేరుకున్నాయి.  పసిడి ప్రియులకు ఇది.. కాస్త ఊరటనిచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో హెచ్చు తగ్గుల కారణంగా ఇటీవల మళ్లీ పసిడి ధరలు పెరిగాయి. పస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జనవరి 22వ తేదీ సోమవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఎన్నాయో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో ని ప్రధాన నగరాలైన హైదారాబాద్, విజయవాడలో బంగారం దరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,050 గా ఉంది.  కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది.

 దేశ రాజధాని ఢిల్లీ నగరంలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200 గా ఉంది. ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050గా..  కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050లుగా ఉంది. ఢిల్లీ, మంబైయి, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,500గా ఉంది.

 చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,550లుగా ఉండగా.. కిలో వెండి ధర రూ.రూ.77,000గా ఉంది.  బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,050గా ఉంది. కిలో వెండి ధర రూ.73,000 గా ఉంది.