సొంతగడ్డపై గుజరాత్ గెలిచేనా..?

సొంతగడ్డపై గుజరాత్ గెలిచేనా..?

ఐపీల్ సీజన్ -15 క్లైమాక్స్ కి చేరింది. ఇవాళ మెగా వార్ జరగనున్న విషయం తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్ లో సొంతగడ్డపై గెలిచి, కొత్త టీమ్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించాలని గుజరాత్ టైటాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉండగా.. తిరుగులేని  రాజస్తాన్ రాయల్స్ అదే ధీమాతో ఉంది. రెండు టీమ్స్ మధ్యన పోరు అంటేనే అందరిలోనూ ఆసక్తి అలాంటి అసలు సిసలైన కిక్కుకి టైమైంది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌ మధ్య హై ఓల్టేజ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. అరంగేట్రం లీగ్‌‌‌‌లోనే ఫైనల్‌‌‌‌కు చేరి కొత్త చరిత్ర సృష్టించిన జీటీ.. టైటిల్‌‌‌‌నూ గెలవాలని పక్కా లెక్కలతో బరిలోకి దిగుతున్నది. ఇక ఆసీస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ నేతృత్వంలో 2008లో టైటిల్‌‌‌‌ గెలిచిన రాయల్స్‌‌‌‌.. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని భావిస్తోంది. అప్పుడు కూడా ఏమాత్రం అంచనాల్లేకుండా లీగ్‌‌‌‌లోకి వచ్చి ఏకంగా టైటిల్‌‌‌‌ను ఎగురేసుకుపోయింది. కాబట్టి మరోసారి అదే ఫీట్‌‌‌‌ను పునరావృతం చేయాలని రాయల్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. క్వాలిఫయర్‌‌‌‌–1లో రాజస్తాన్‌‌‌‌పై గెలవడం జీటీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఓవరాల్‌‌‌‌గా రెండు జట్లు కొత్త చరిత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో చాంపియన్‌‌‌‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

పవర్‌‌ హిట్టర్లతో.. పదునెక్కిన బౌలర్లతో జీటీ కాస్త బలంగా కనిపిస్తున్నా.. తనదైన రోజున విశ్వరూపం చూపే బట్లర్‌‌ అండతో రాయల్స్‌‌ కూడా రెండో టైటిల్‌‌ను లక్ష్యంగా పెట్టుకుంది..!. బట్లర్ నే టార్గెట్ గా పెట్టుకున్న టైటాన్స్.. ప్రారంభంలోనే డేంజరస్ బట్లర్ ను ఎలా ఔట్ చేయాలనే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగా లీగ్‌‌కు అదిరిపోయే ముగింపు ఇచ్చేందుకు రెడీ అయిన పాండ్యాసేన.. శాంసన్‌‌ బృందానికి మూడోసారి షాకిచ్చి కొత్త చాంపియన్‌‌గా అవతరిస్తుందా? లేక పాత చాంపియన్‌‌కే టైటిల్‌‌ను అప్పగిస్తుందా? చూడాలి..!