టెట్ అప్లైకి నేడు ఆఖరు .. ఇప్పటి వరకూ 1.93 లక్షల అప్లికేషన్లు

టెట్ అప్లైకి నేడు ఆఖరు ..  ఇప్పటి వరకూ 1.93 లక్షల అప్లికేషన్లు

.హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారంతో  ముగియనున్నది. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 72,771 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,20,364 వచ్చాయి. 2016లో నిర్వహించిన టెట్ కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో  2.83 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్ ఫీజు పెంపు వల్ల గతేడాది కంటే అప్లికేషన్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో మీసేవా సెంటర్లు అందుబాటులో లేవని,  మరో మూడు రోజులు దరఖాస్తు గడువు పెంచాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.