ఇవాళ (జూన్ 5) సాయంత్రం ఇండియా కూటమి భేటీ 

ఇవాళ (జూన్ 5) సాయంత్రం ఇండియా కూటమి భేటీ 

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీకి 293 సీట్లు, కాంగ్రెస్ కు 233 వచ్చాయి. బీజేపీ స్వల్ప అధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహా లు ప్రారంభించింది. మరోవైపు ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా చర్చలు జరుపుతున్నాయి. ఇవాళ (జూన్ 5) ఉదయం 11.30 గంటలకు ఎన్డీయే కూటమి కీలక సమావేశం కానుంది. సాయంత్రం ఇండియా కూటమి తమతో కలిసొచ్చే నేతలతో భేటీ కానుంది. 

2024 లోక్ సభ ఎన్నికల్లో ఫలితాల తర్వాత కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తుందనేదానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 293 సీట్లు గెలుచుకున్న బీజేపీ ..మ్యాజిక్ ఫిగర్  దాటినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్,టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మద్దతు కీలకమైంది.

 క్రమంలో వీరిద్దరిని ఎటుపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు తమకు కూడా అవకాశం  ఉందని భావిస్తోంది. ఈ క్రమంలో తమతో కలిసొచ్చే అన్ని పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఇవాళి  జరిగే ఎన్డీయే, ఇండియా కూటమి కీలక భేటీల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు పై ఓ కొలిక్కి రానుంది.